» ఐరన్ ఆక్సైడ్ - టేపు రికార్డర్ టేపుపై పూత కోసం
» హైపో - దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్‌ను తొలగించడానికి
» సల్ఫర్ - రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి
» సోడియం బై కార్బొనేట్ - ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి
» టెఫ్లాన్ - పదార్థాలు అంటకోకుండా గిన్నెలకు పూతపూయడానికి
» మిథైల్ ఆల్కహాల్ - శుద్ధ ఆల్కహాల్‌ను తాగకుండా నిరోధించడానికి
» సోడియం కార్బొనేట్ - నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి
» కాల్షియం హైడ్రాక్సైడ్ - నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి
» పొటాష్ ఆలం - గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికి నీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి
» సోడియం హైపోక్లోరైట్ - దుస్తులపై కాఫీ మరకలు తొలగించడానికి
» సోడియం పెంటథాల్ - నిజ నిర్ధారణ పరీక్ష కోసం
» సోడియం హైడ్రాక్సైడ్ - నూలును మెర్సిరైజ్ చేసి తెల్లగా మార్చడానికి
» సోడియం ఫ్లోరైడ్ - దంతాల్లో పింగాణి ఏర్పడేందుకు
» రసరాజం - బంగారాన్ని కరిగించడానికి
» సిలికాజెల్ - మందు సీసాల్లో తేమను గ్రహించడానికి
» ఆగ్జాలిక్ ఆమ్లం/ నిమ్మరసం - వస్త్రాలపై తుప్పు, సిరా మరకల్ని తొలగించడానికి
» కార్బన్ డై ఆక్సైడ్ - మంటల్ని ఆర్పడానికి
» కాల్షియం హైడ్రాక్సైడ్ - ఇళ్ళకు వెల్లవేసేందుకు
» పొటాషియం డైక్రోమేట్ - మద్యం తాగిన డ్రైవర్‌ని గుర్తించడానికి
» గ్రాఫైట్ - భారీ యంత్రాల్లో మృదుత్వం కోసం కందెనగా వాడటానికి
» ఇథిలీన్ - పచ్చి కాయల్ని పండించడానికి
» ద్రవ నైట్రోజన్ - పశువుల వీర్యాన్ని నిల్వ చేయడానికి
» హైడ్రోజన్ పెరాక్సైడ్ - సిల్కు, ఉన్ని వస్త్రాలను విరంజనం చేయడానికి
» ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ - పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ చేయడానికి
» భారజలం - అణురియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి
» ఇథిలీన్ గ్త్లెకాల్, గ్లిజరాల్ - కారు కార్బొరేటర్‌లో యాంటిఫ్రీజ్‌గా
» ఎసిటిలీన్ - ఆక్సిజన్‌తో పాటు గ్యాస్ వెల్డింగ్‌లో మంటకోసం
»నిన్‌హైడ్రిన్- కాగితంపై వేలిముద్రలను స్పష్టంగా గుర్తించడానికి
»సబ్బుద్రావణం - నీటి కాఠిన్యాన్ని గుర్తించడానికి
»ఓజోన్- మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపేందుకు
» సిల్వర్ అయోడైడ్ - కృత్రిమ వర్షాలకోసం, మేఘమథనం చేయడానికి
» ఫ్రియాన్ - రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణకు
» ఫినాల్ ఫార్మాల్డిహైడ్ - టెలిఫోన్ పెట్టెల తయారీకి
» బ్లీచింగ్ పౌడర్ - తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి
» అనార్ధ్ర కాపర్ సల్ఫేట్ - పదార్థాల్లో తేమను గుర్తించడానికి
» గ్లిజరిన్ - సబ్బు తయారీలో
» క్లోరల్ హైడ్రేట్ - కల్తీ కల్లులో నురగకు
» కార్బన్ బ్లాక్ - నల్లని ప్రింట్ సిరా తయారీకి
» హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం - గాజుపై అక్షరాల్ని రాయడానికి
» సిట్రనెల్లాల్ - శీతల పానియాల్లో నిమ్మవాసనకు
» క్లోరోఫాం - మత్తు ఇవ్వడానికి/ స్పృహ లేకుండా చేయడానికి
»పొటాషియం స్టియరేట్ - షేవింగ్ సబ్బులో నురగ ఏర్పరచడానికి