Type Here to Get Search Results !

ABOUT AP GOVT NAVARATNALU SCHEMES IN TELUGU

0

ABOUT AP GOVT NAVARATNALU SCHEMES IN TELUGU





గ్రామ సచివాలయ పరీక్షల ప్రత్యేకం





నవరత్నాలు - 9





1. జగనన్న అమ్మ ఒడి పథకం 





2. వైయస్సార్‌ రైతు భరోసా పథకం





 3. వైయస్సార్‌ పింఛను పథకం





 4. మద్యపాన నిషేధం





 5. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ





6. జగనన్న విద్యాదీవెన 





7. పేదలందరికీ ఇళ్ళు 





8. వైయస్సార్‌ ఆసరా - వైయస్సార్‌ చేయూత





9. వైయస్సార్‌ జలయజ్ఞం 










1.జగనన్న అమ్మ ఒడి పథకం





ప్రారంభం : 09 జనవరి 2020 





ముఖ్య ఉద్దేశం : అక్షరాస్యతా శాతాన్ని పెంచటం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం. ముఖ్యాంశాలు : - పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఆర్థిక భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ''జగనన్న అమ్మ ఒడి పథకాన్ని'' ఏర్పాటు చేసింది. - ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఏటా అందిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఏ పాఠశాల/కళాశాల (ఇంటర్మీడియట్‌)కు పంపినా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. పథకం తల్లులకు ఉద్దేశించిందే తప్ప ఏ పాఠశాలకు/కళాశాలకు పంపుతున్నారన్న దానిపై ఆధారపడింది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 





తెల్ల రేషన్‌కార్డు ఉన్న తల్లులు





ఎ. బడి స్థాయిలో - 36,88,952 





బి. జూనియర్‌ కళాశాల స్థాయిలో - 6,17,048 -





పది వరకూ చదువుతున్న విద్యార్థులు - 70 లక్షలు,





ఇంటర్మీడియట్‌ విద్యార్థులు - 9.65 లక్షలు. 





2019-20 రాష్ట్ర బడ్జెట్‌ ఈ పథకానికి కేటాయింపులు - రూ. 6455.80 కోట్లు.





ఇందులో ఒకటి నుంచి పదోతరగతి వరకు పిల్లలకు రూ.5,595 కోట్లు ఇంటర్‌ విద్యార్థులు రూ.860 కోట్లు అందజేస్తారు.





నిబంధనలు :- ఒక తల్లికి చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా రూ.15000 ఇస్తారు.- దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, అనగా తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్న వారు అర్హులు.ఉపయోగం :చదువుల భారం తగ్గి, పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి. చదువు మధ్యలో మానేయటం తగ్గుతుంది.బాలకార్మిక సమస్య తగ్గుతుంది.






2. వైయస్సార్‌ రైతు భరోసా పథకం





ప్రారంభం : 15 అక్టోబర్‌, 2019 





ముఖ్య ఉద్దేశం : రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించటం.





ముఖ్యాంశాలు :- ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12,500 చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఈ ఏడాది రబీ నుండి అమలుచేస్తారు.- ఈ పథకం కింద కౌలు రైతులకు సాయం అందించేందుకు 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులను అందిస్తారు. - ప్రభుత్వమే రైతుల తరపున పంటల బీమా ప్రీమియం చెల్లించి, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తారు.- రైతులకు ఉచితంగా బోర్లు, పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత్‌ విద్యుత్‌ అందించనున్నారు. - వ్యవసాయ సంక్షోభంలో ఉన్న రైతులు చనిపోతే వైయస్సార్‌ బీమా కింద రూ.7 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. - సహకార రంగంలో డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు అదనంగా చెల్లిస్తారు. 





2019-20 రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు - రూ. 8,750 కోట్లు.- ప్రకృతి విపత్తుల నిధికి రూ. 2000 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 3000 కోట్లు.- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌, టోల్‌ టాక్స్‌ రద్దు. వడ్డీ లేని రుణాలు : - రైతులు బ్యాంకు నుంచి రూ. లక్షలోపు పంట రుణం తీసుకొని గడువులోగా చెల్లిస్తే అందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. - ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు - రూ. 100 కోట్లు





వైయస్సార్‌ రైతు బీమా పథకం: - అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.7 లక్షల పరిహారం అందిస్తుంది. ఈ మొత్తాన్ని అప్పులవారు తీసుకునే వీలు లేకుండా చట్టం తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. - 2014-19 మధ్య ఆత్మహత్య చేసుకొని - పరిహారం అందని వారిలో అర్హులను గుర్తించి వారికి కూడా పరిహారం ఇవ్వనుంది.- ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు - రూ. 100 కోట్లు. ఉచిత పంటల బీమా- సాగయ్యే అన్ని పంటలకు ఉచిత బీమా కల్పిస్తారు. రైతు చెల్లించాల్సిన వాటానూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. - బీమా చేసే విస్తీర్ణం - 55 లక్షల హెక్టార్లు - ఖరీఫ్‌, రబీల్లో లబ్ధి పొందే వారి సంఖ్య - 85 లక్షల మంది - ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు - రూ. 1,168 కోట్లు ధరల స్థిరీకరణ నిధి: - పంటలకు మద్దతు ధరలు లభించని సమయంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి కొనుగోలు చేస్తుంది. - దీనికోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు - రూ. 3000 కోట్లు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ : - రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా లబ్ది : 18.15 లక్షల పంపుసెట్లు వినియోగించే రైతులకు - రాష్ట్రంలో 6,663 వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లు ఉన్నాయి. ఇందులో 3,854 ఫీడర్లు(60 శాతం) లోనే ప్రస్తుతం తొమ్మిది గంటల సరఫరాకు అనువైన సౌకర్యాలు ఉన్నాయి.- మిగిలిన వాటికి సదుపాయాల కల్పనకు రూ. 1700 కోట్లు కేటాయించారు. - దీనికోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు - రూ. 4,525 కోట్లుమత్స్యకారులకు ఊరట :- పథకం : ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల పరిహారం అందించనున్నారు. -





ప్రయోజనం : వేటకు వెళ్ళి ప్రమాదాల పాలయ్యే మత్స్యకార కుటుంబాలకు దీనిని ఇస్తారు. - పథకం : సముద్రంలో ఏటా 61 రోజులు వేట నిషేధించిన సమయంలో భృతిగా ఇస్తున్న రూ. 4 వేలను రూ. 10 వేలకు పెంచారు. - లబ్ది : 96,662 మత్స్యకారులు లబ్ది పొందనున్నారు. - వీటికోసం బడ్జెట్‌లో కేటాయింపులు - రూ. 100 కోట్లు కౌలు రైతులకు కొత్త చట్టం: - కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు, సాయం అందించే దిశగా కౌలు రైతు చట్టంలో సమూల మార్పులు తీసుకురాబోతున్నారు. - భూ యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా భూ యజమాని, కౌలు రైతు మధ్య 11 నెలల కాలానికి మాత్రమే ఒప్పందం అమల్లో ఉండేలా సవరణలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ స్థాయిలో ప్రకృతి సాగు వ్యవసాయం: - రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగం అధికమై, ఆహార పంటల్లో అవశేషాలు పెరుగుతున్నాయి. ఈ దుష్ఫలితాలను నివారించి, తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను పండించడానికి ప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం పథకాన్ని అమలు చేయనుంది. - పరం పరాగత కృషి వికాస యోజన పథకం కింద రూ. 91.31 కోట్లు ప్రతిపాదించింది. రైతు సంఘాలకే యంత్రాలు: - రాష్ట్రంలో హెక్టారు భూమిలో వ్యవసాయానికి 2.5 కిలోవాట్ల యంత్రశక్తి అవసరం కాగా... ప్రస్తుతం 1.72 కిలోవాట్లు మాత్రమే అందుబాటులో ఉంది.. - యాంత్రీకరణను పెంచే క్రమంలో రైతుసంఘాలను గుర్తించి కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. అక్కడ రైతులకు అవసరమయ్యే అన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచుతారు. - ప్రస్తుత బడ్జెట్‌ ఈ పథకానికి కేటాయింపులు - రూ. 460.05 కోట్లు ఇంటిగ్రేటెడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ : - ఎరువులు, పురుగు మందులు, విత్తనాల్లో కల్తీని నివారించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ సమగ్ర పరీక్ష కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ ల్యాబ్‌) ఏర్పాటు చేయనున్నారు.- పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తరువాతే రైతులకు ఉత్పత్తులు అందిస్తారు. - రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసే సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఎక్కడైనా పొరపాటు జరిగి, రైతు నష్టపోతే సంస్థలే బాధ్యత వహించేలా ముందు వాటి నుంచి ధరావతులు తీసుకుంటుంది. మరో 10 లక్షల టన్నుల గోదాములు: - రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వకోసం 10 లక్షల టన్నుల సామర్థ్యంలో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం లకంగా పెట్టుకుంది.- దీనికి గోదాముల మౌలిక వసతుల నిధి కింద రూ. 200 కోట్లు కేటాయించింది.- కొత్త గోదాముల నిర్మాణానికి రూ. 37 కోట్లు ఇవ్వబోతుంది. - కొత్తగా 100 రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. 50 శాతం రాయితీపై పసుపు విత్తనం:- ఉద్యానశాఖ ద్వారా పసుపు - గ్రామ విత్తన కార్యక్రమం ద్వారా కర్కుమిన్‌ అధికంగా ఉండే వంగడాలను రైతుకు రాయితీపై అందించే దిశగా ప్రణాళిక రూపొందించారు.- కేరళలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ (××ూ=) ఆధ్వర్యంలో విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే 'మహిమ, వరద రకాల అల్లాన్ని కూడా రైతులకు అందిస్తారు.- కొత్తగా 100 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారు. డెయిరీలకు రూ. 100 కోట్లు : - సహకార రంగంలోని పాల సమాఖ్యలు, పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు కేటాయించారు.- సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.4 చొప్పున బోనస్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు : - ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు విధాన సలహా మండలిగా వ్యవసాయ (అగ్రికల్చర్‌) మిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2019 జులై 1న ఉత్తర్వులు జారీ చేసింది. - ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఛైర్మన్‌గా, రైతు నాయకుడు వి. నాగిరెడ్డి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. - ప్రతి నెలా మిషన్‌ విధిగా సమావేశమవుతుంది.- ప్రకృతి విపత్తుల నిధి రూ. 2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ. 3 వేల కోట్లు నిధుల్ని ఎలా వినియోగించాలో కూడా ఇదే నిర్ణయిస్తుంది. గ్రామ సచివాలయాల్లో ఇద్దరు సహాయకులు: - కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో రైతు సేవల కోసం వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి ఇద్దరు సహాయకుల్ని నియమించబోతున్నారు. 1. వ్యవసాయ, ఉద్యానరంగాల నుంచి - గ్రామ వ్యవసాయ సహాయకుడు(Village Agri-cultural Assistant)2. మత్స్య, పశు సంవర్థక రంగాల నుంచి - పశు సంవర్థక సహాయకుడు (A.H. Assistent) ఉపాధి హామీ కింద సాగుకు - రూ. 3,626 కోట్లు :- కరువు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మినీ గోకులం, పట్టు పరిశ్రమ, చేప పిల్లల్ని పెంచే చెరువులు, ఎండబెట్టే యార్డులు, పండ్లతోటల పనులకు ఉపాధిహామీ నిధుల్ని వినియోగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.- ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 3,626 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఖర్చు చేయనుంది. - 81 వేల ఎకరాల్లో పండ్లతోటలు, ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం, 25 వేల చెరువుల పునరుద్దరణ, 35 వేల ఎకరాల్లో భూమి అభివృద్ధి, 25,000 ఊటకుంటలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది. 






3. వైయస్సార్‌ పింఛను పథకం : - ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌.ఐ.వీ బాధితులు, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కళాకారులకు ప్రతి నెలా ఇచ్చే రెండు వేల పింఛనును రూ. 2,250లకు పెంచుతూ 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఈ పథకానికి 'వైయస్సార్‌ పింఛను పథకం'గా నామకరణం చేసి, తొలి సంతకం చేశారు.- అవ్వా తాతలకు పింఛన్‌ రూ. 2000ల నుంచి 2022 నాటికి దశల వారీగా రూ. 3000లకు పెంచుతారు.- ఈ పథకం కింద సామాజిక భద్రత పింఛన్లు అర్హత వయస్సును 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకు తగ్గించారు.- ప్రజా సాధికార సర్వే ప్రకారం 60-65 ఏళ్ళ మధ్య 5.49 లక్షల మంది ఉన్నారు.- తలసేమియా, పక్షవాతం, కుష్టు వ్యాధిగ్రస్థులకు కూడా త్వరలో పింఛనును ఇవ్వనున్నారు. - కొత్తగా అన్నివర్గాల వారికి 11.20 లక్షల మంది అదనంగా పెన్షన్‌కు అర్హత సాధిస్తారని ప్రభుత్వం గుర్తించింది.- 2019-20 పింఛన్ల పథకానికి కేటాయింపులు - 15,746.58 కోట్లు.- వైయస్సార్‌ అభయహస్తం పింఛనుదారులకు కొత్తగా నెలకు రూ. 2,750 చొప్పున ప్రతి నెలా పింఛను అందనుంది.
4. మద్యపాన నిషేధం: - మద్యపానం సామాజిక సమస్యగా, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగాజార్చే విధంగామద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రలో వాగ్దానం చేశారు.- మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకే పరిమితంచేస్తూ మూడు దశల్లో మధ్యపాన నిషేధం. - ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమలు చేసే మద్యం నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ యాజమాన్య దుకాణాలు నిర్వహించనున్నట్లు బడ్జెట్లో సుస్పష్టం చేశారు.- ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.- అధికారంలోకి రాగానే బెల్టు షాపులపై సీఎం జగన్‌ ఉక్కుపాదం మోపారు.- కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని ప్రకటించారు.- మద్యం షాపులకు లైసెన్సు కాల పరిమితి ముగియగా, సెప్టెంబర్‌ వరకూ పొడిగించారు. - ఈ లోగా ప్రభుత్వ యాజమాన్య దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.- త్వరలో మద్యపాన నియంత్రణ కమిటీలు - ఇప్పటికే మద్యపానాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. - త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నియంత్రణ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.- మరోవైపు డీ -అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటు దిశగా వైద్య, ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
5. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ : - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 జూన్‌ 3న ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంగా మార్చింది. - వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. - ఎన్ని లక్షలు ఖర్చయినా వైద్యసాయం.- హైదరాబాద్‌, చెన్నరు, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు.- చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం. - కిడ్నీ, తలసేమియా, కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేల పింఛను.- కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1500 కోట్లు కేటాయింపు. - 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైయస్సార్‌ ఆరోగ్యశ్రీకి కేటాయింపులు - రూ. 1,740 కోట్లు.- మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్లో కేటాయింపులు - 11,398.99 కోట్లు.- ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది.
6. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (బోధనా రుసుములు పూర్తి చెల్లింపు) :- ఉన్నతవిద్య చదువుతున్న పేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన రుసుములను పూర్తిగా చెల్లించి, ఉన్నత చదువులను ప్రోత్సహించాలని తలపెట్టింది. - అమలు: ప్రస్తుతం సాధారణ డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు కొన్ని పరిమితులతో బోధన రుసుములు చెల్లింపు జరుగుతోంది. ఉదా : ఎస్సీలు, ఎస్టీలు మినహా మిగతావారు ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో పదివేలకు ర్యాంకులతో కన్వీనర్‌ కోటా కింద సీటు తెచ్చుకుంటే ఏడాదికి రూ.35 వేలు చెల్లిస్తున్నారు. మిగతా మొత్తాన్ని విద్యార్థులే భరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రుసుము మొత్తాన్ని తానే చెల్లించి, ఉచితంగా ఉన్నతవిద్య అందించేలా ఈ కొత్త పథకం తెచ్చింది. - విద్యార్థులు - 15,35,911- చెల్లింపులు - రూ. 2,070.61 కోట్లు- 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులు - రూ. 3,151.74 కోట్లు.జగనన్న విద్యాదీవెన:- విద్యార్థులు ప్రైవేట్‌ వసతి గహాల్లో ఉంటే ఏటా రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వసతి, ప్రయాణం, పుస్తకాలు, భోజనాలకు ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20 వేలు చెల్లిస్తారు.- ఈ పథకంలో ప్రైవేట్‌ వసతి గృహాల్లోని వారికి దాదాపు సగం భారం తగ్గుతుంది.- దీన్ని ఇంటర్‌ విద్యార్థులకు వర్తింపజేస్తారు. ఈ మొత్తం తల్లులకే ఇస్తారు. - విద్యార్థుల సంఖ్య - 15,35,911 - ప్రస్తుత విధానంలో ఉపకార వేతనం - రూ. 1,226.05 కోట్లు.- రూ. 20 వేలు ఇస్తే ఖర్చు - రూ. 1,810.56 కోట్లు - 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులు - రూ. 1,810. 56 కోట్లు
7. వైయస్సార్‌ గహనిర్మాణ పథకం (పేదలందరికీ ఇళ్లు) : - ఈ పథకం కింద ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తారు. - ఉగాదికి 25 లక్షల మందికి సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు.- మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకుల నుంచిరుణాలు ఇప్పించడం.- రెవెన్యూ నివేదిక ప్రకారం మార్చి చివరి నాటికి ఇంటికోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 11.87 లక్షల మంది కాగా, వారిలో 8.38 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. - 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులు : రూ. 16, 720 కోట్లు. - ఈ ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ గృహ వసతి పథకం కోసం రూ. 5,000 కోట్లు పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అమలుకు రూ.1,540 కోట్లు, వైఎస్సార్‌ గహ నిర్మాణ పథకం కింద బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి రూ.1,280.29 కోట్లు .- వైఎస్సార్‌ అర్బన్‌ హౌసింగ్‌ పథకానికి రూ.1000 కోట్లు, గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు రూ. 565.25 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణాలకు లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం వివిధ సంస్థల్లో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు, బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ.150.21 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
8. వైయస్సార్‌ ఆసరా : - పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ము నాలుగు దఫాలుగా అక్కాచెల్లెమ్మల చేతికే అందించటం. - సున్నా వడ్డీకే రుణాలు.- డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోంది. నెలవారీ వాయిదాల రూపంలో వడ్డీతో కలిపి మహిళలు ఆయా బ్యాంకులకు చెల్లిస్తున్నారు.- మహిళలు చెల్లించే వడ్డీని ప్రభుత్వం రాయితీ రూపంలో విడతల వారీగా సంఘం బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తోంది. - ఈ బడ్జెట్లో డ్వాక్రా మహిళల కోసం రూ. 1,788 కోట్లు కేటాయించారు. - పాత బకాయిలు - రూ. 3,037 కోట్లు (2016 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు)- గ్రామీణ పరిధిలోని డ్వాక్రా మహిళలు - రూ. 2,303 కోట్లు- పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలు - రూ. 734 కోట్లు - సున్నా వడ్డీకే రుణ మంజూరు లక్ష్యం - రూ.16,819 కోట్లు- వడ్డీ రాయితీకి బడ్జెట్లో కేటాయింపులు :1) గ్రామీణ ప్రాంతాల్లో - రూ. 1,140 కోట్లు 2) పట్టణ పరిధిలో - రూ. 648 కోట్లువైయస్సార్‌ చేయూత - 45 ఏళ్ళు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు దశల వారీగా ఉచితంగా రూ. 75 వేలు సాయం చేయటం. 
9. వైయస్సార్‌ జలయజ్ఞం: - యుద్ధ ప్రాతిపదికన పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా ప్రాజెక్టులు పూర్తి. - తాగు నీరు, సాగునీటి అవసరాల కోసం చెరువుల పునరుద్దరణ.- ఈ బడ్జెట్లో పోలవరానికి రూ. 5254 కోట్లు కేటాయించారు.- ఈ బడ్జెట్లో (2019-20 ఆర్థిక సంవత్సరానికి) జల యజ్ఞానికి 13,139.04 కోట్లు కేటాయించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

close